సచ్చిదానంద రూపాయ సత్కామ ఫలదాయినే|

చిన్తామణి గణేశాయ ప్రణామా నర్పయామితే||

గౌరీ సుతాయ బాలాయ బుద్ధిమత్తా గరీయసే|

చిన్తామణి గణేశాయ ప్రణామా నర్పయామితే||

వినాయకాయ దేవాయ సదా శివ మయాయ చ|

చిన్తామణి గణేశాయ ప్రణామా నర్పయామితే||

కుమారస్యాగ్ర జాతాయ బాధారిష్ట వినాశినే|

చిన్తామణి గణేశాయ ప్రణామా నర్పయామితే||

కాశీ క్షేత్ర విభాసాయ చిత్త శుద్ధి ప్రదాయినే|

చిన్తామణి గణేశాయ ప్రణామా నర్పయామితే||

చిన్తామణి గణేశాన స్తుతి పంచక మాదరాత్|

పఠిత్వా సదభీష్టాని సాధయే న్నాత్ర సంశయః||

 

జయ గురు దత్త 

ప్రతి నెలలో మొదటి, మూడవ మంగళవారములు శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పణ కలదు. ప్రతి శనివారము నాగవల్లీ దళములతో (తమలపాకులతో) అర్చన కలదు. ప్రతి రోజు సింధూర అర్చన, అభిషేకము కలదు. కావున సద్భక్తులందరూ పై సదవకాశాన్ని సద్వినియోగపరచుకొని, శ్రీ కార్యసిద్ధి ఆంజనేయస్వామి వారి మరియూ శ్రీ సద్గురు కృపకు పాత్రులు కాగలరు.

శ్రీ శ్రీ శ్రీ దత్తవిజయానంద తీర్థ స్వామీజీ వారి అనుజ్ఞ మేరకు “ శ్రీ అన్నపూర్ణ మందిరం” నిర్మాణమునకుభక్తులు తమ వంతుగా పది ఇటికలను సమర్పణ చేసుకొనవచ్చును. 10 ఇటికల సమర్పణ నిమిత్తం రుసుము రూ. 1,000/-లు గా నిర్ణయించడమైనది.కావున సద్భక్తులందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకొని అన్నపూర్ణ మందిర నిర్మాణములో తమ వంతు భాగస్వామ్యాన్ని పొంది శ్రీ స్వామీజీ వారి సంపూర్ణ అనుగ్రహమునకు పాత్రులు కాగలరు.

తే. 18-04-2014 దిన శుక్రవారము సా. గం. 04:00 లకు శ్రీ సంకష్టహర గణపతి చతుర్థీ వ్రతము జరుగును.

 

Click here for SHATA SLOKI RAMAYANAM

Click here for HANUMAN MANTRA

Click here for GRAND PIANO CONCERT

శ్రీ గురు దత్త